ఇన్ని హిట్లు కొట్టిన బాలయ్యకు ఆ రికార్డే లేదు..ఎప్పటికి వస్తుందో మరి ?

ఇన్ని హిట్లు కొట్టిన బాలయ్యకు ఆ రికార్డే లేదు..ఎప్పటికి వస్తుందో మరి ? విక్టరీ వెంకటేష్,నందమూరి బాలక్రిష్ణ ,మెగా స్టార్ చిరంజీవి,అక్కినేని నాగార్జున వీరందరూ పాత తరం నటులే కావచ్చు ఇప్పటి యువతకు వీరు సామర్ద్యం కాని వీరి నటన కౌసల్యత కాని వీరి సినిమాల గొప్పతనం ఆ కాలం లో వీరు చేసిన సినిమాల తాలుకు విశేషం కాని ముఖ్యం గా ప్రతిభ కాని కష్టం ఇలా చాలా విషయాలు మనకి తెలీదు .రోజుకు మూడు షిఫ్టులు పని చేసి గొడ్డులా కష్ట పడితే ఈ రోజు ఇండస్ట్రీ కి నాలుగు స్తంభాలు లా నిలిచారు అని చెప్పుకుంటున్నారు.అయితే వారి సినిమాలు జనాల మీద ఎలా ప్రభావం చూపాయో కూడా ఈ తరం జనలకి అభిమానులకి తెలీదు.ఇక ఈ రోజుల్లో అన్నీ రికార్డుల్లోనే హీరో ప్రథిభ మరియు హీరో కష్టం కొలుస్తున్నారు కాబట్టి మనం కూడా అదే పంధాలో వెళ్తున్నాం.

అసలు సినిమా ఎలా ఉన్నా కలెక్షన్స్ యే ముఖ్యం.ఇక తాజాగా సంక్రాంతి పండగకి సీనియర్ హీరోలు ఇద్దరు బరిలో ఉంటే ఇద్దరి సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది అయితే హిట్ అయినా కాని కొన్ని సార్లు కలెక్షన్స్ విషయం లో ఏ సినిమా కు అయినా దిఫరెన్స్ రావడం ఖాయం ఇక్కడే అదే జరిగింది.సినిమాలు రెండింటికి హిట్ టాక్ యే కానీ కలెక్షన్స్ మాత్రం చాలా తేడా పోలికే లేదు అవును డాకు మహరాజ్ మొదటి రెండు ఒరజులు చేసిన కలెక్షన్స్ తర్వాత తగ్గినా దానిని దాటి ఇక ముందుకు వెళ్ళలేదు .ఇక ఈ సారి మాత్ర విక్టరీ వెంకటేష్ మాత్ర బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి తే స్రుష్టించాడు ఈ సినిమా తో ఈ రోజుతో ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు అసలు వెంకి కి అంత మార్కెట్ ఉందా అసలు సాధ్యమేనా అనే అందరికి ఈ సినిమా తో అందరి నోర్లూ మూయించాడు సినిమా సక్సెస్ అవ్వాలే కాని దాని ప్రభావం ఏ రేంజ్ లో ఉంటుందో వెంకి ఈ సినిమా తో ప్రూవ్ చేశాడు

.ఇక ఈ సినిమా తో వెంకి చిరు సరసన చేరిపోయాడు అయితే బాలయ్య ఈ మధ్య కాలం లో మాత్రం వరుస హిట్లతో జోరు మీద ఉన్నా కాని ఇంకా 100 కోట్ల షేర్ చేసిన సినిమా లేదు .ఇది ఆయన కు వరుసగా నాలుగో హిట్ కాని ఒక్కటి 100 కోట్ల మార్క్ దాటలేదు.ఇప్పటి యువ హీరోలలో అందరికి దాదాపు ఉన్నాయి కాని సీనియర్ హీరో లలో మాత్రం ఒక్క చిరుకే ఈ రికార్డ్ మూడు సార్లు వచ్చింది.ఖైది నెం 150,సైరా ,మొన్న వాల్తేరు వీరయ్య సినిమా లతో 100 కోట్లు ముచ్చటగా మూడు సార్లు అందుకున్నాడు.అయితే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా తో వెంకీ కూడా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు.

sankranitki vastunnam beats bahubali 2
బాహుబలి 2 ని భారీ మార్జిన్ తో బీట్ చేసిన వెంకి మామ…ఆల్ టైం రికార్డు వెంకి మామ పేరు మీదే!

ఇన్ని హిట్లు కొట్టిన బాలయ్యకు ఆ రికార్డే లేదు..ఎప్పటికి వస్తుందో మరి ?

అయితే చాల కాలం గా సరైన్ హిట్ లేని నాగ్ తో పాటు వరుస హిట్లతో జోరు మీద ఉన్న బాలయ్య ఈ క్లబ్ లో ఎప్పుడు చేరు తారో మని మనం ఇంకా కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.అయితే బాలయ్య తన తదుపరి సినిమా ఇప్పటికే షూటింగ్ కూడా జరుపుకుంటుంది .అఖండ 2 సినిమా నే అది బోయపాటి ఈ సినిమా కు డైరెక్టర్.అలాగే మరికొన్ని సినిమాలు బాలయ్య బాబు లైన్లో ఉంచారు.మరి ఈ సినిమాలో అఖండ 2 సినిమా కే 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఈ సినిమా మొదటి భాగం తోనే అన్నీ చోట్ల మంచి రెస్పాన్స్ రిసీవ్ చేసుకుంది కొన్ని విజువల్స్ చూసిన నార్త్ ఆడియన్స్ సినిమా కోసం బాగా వెయిట్ చేస్తూ ఉన్నారు.

ఈ సినిమా మేకర్స్ కూడా అన్ని భాషలో సినిమా విడుదల చేయాలి అని ఫిక్స్ అయి పోయారు.ఇక నాగ్ కూడా రజని కాంత్ సినిమాలో స్పెషల్ రోల్ లో చేస్తుండడం విశేషం అయితే ఆయన కూడా తొందరలోనే 100 కోట్ల షేర్ అందుకుని ఆ క్లబ్ లో చేరిపోవాలి ఒక మంచి సక్సెస్ కోసం అయితే మొత్తం అక్కినేని అభిమానులు ఎంతో వెయిట్ చేస్తున్నారు.గత కొంత కాలం గా వారి ఫ్యామిలీలో ఒక్క హిట్ లేదు కొడుకుల సినిమాలు కూడా సరిగ్గా ఆడడం లేదు అందుకే అభిమానులు మంచి ఆకలితో ఉన్నారు.ఇక చిరంజీవి కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఆయన విశ్వంభర సినిమా పూర్తి చేశారు కొన్ని సాంగ్స్ మిగిలి ఉన్నాయి అలాగే అనీల్ రావిపూడి తో సినిమా అవ్వగానే శ్రీకాంత్ ఓదెల సినిమా లైన్లో రెడీగా ఉంది.ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా ను న్ర్మించేది మరెవరో కాదు హీరో నాని .

ఒక ఫ్యాన్ ఏమో డైరెక్టర్ మరొక ఫ్యాన్ ఏమో ఫ్రొడ్యూసర్ అసలు ఇది కదా కాంబినేషన్ అంటే అని అభిమానులు ఆనందం తో ఉన్నారు.ఎప్పుడు ఇలాంటి కాంబినేషన్ లు జరగవు అప్పుడప్పుడు అలా కుదిరి పోతాయి.అసలు ఈ సినిమా ఎన్నో రికార్డులు స్రుష్టించడం ఖాయం అందులో అనుమానమే లేదు.ఇక వెంకి మామ ప్రస్తుతం ఈ సినిమా హిట్ అవ్వడం తో ఫుల్ జోష్ లో ఉన్నాడు.మళ్ళీ సక్సెస్ మీట్ అంటూ టూర్స్ కోసం సిద్ధం అవుతూ ఉన్నారు.

జయహో బాలయ్య ఎన్టీఆర్ పేరు నిలబెట్టిన వారసుడు..పద్మభూషణ్ బాలయ్య స్పెషల్ స్టొరీ !

అయితే ఆయన తర్వాత సినిమా సురేష్ ప్రొడక్షన్స్ లో ఉండనున్నట్లు తెలుస్తుంది.ఇప్ప్టికే ఆయన రానా నాయుడు 2 సీజన్ షూటింగ్ కంప్లీట్ చేసేసాడు .తర్వాతి సినిమా పై ఇంకా క్లారిటీ రాలేదు అయితే ఈ సినిమా సక్సెస్ తో అయినా మంచి కథల ఎంపిక చేసుకుంతారు అని అభిమానులు ఆశిస్తున్నారు.మరి వెంకి మామ ఆలోచనలు ఏంటో ఏజ్ కు తగ్గ పాత్రలు వచ్చిన ఆయన ఒకే చెప్పడం ఖాయం.అయితే ఇలా సీనియర్ హీరోలు పోటా పోటీ గా సినిమాలు చేయడం హిట్స్ కొట్టి కష్టపడుతుండడం యువ హీరోలకి ఎంతో ఆదర్శం గా నిలుస్తున్నారు.

Leave a Comment