మొన్న దేవర,పుష్ప,ఇప్పుడు గేమ్ ఛేంజర్ ,తెలుగులో ఇంత నెగెటివ్ ఎందుకు ..పూర్తి విశ్లేషణ?తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పెద్ద హీరోలుగా పాన్ ఇండియా రేజ్ లో చలమాణి అవుతున్న హీరోలు ఇప్పుడు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నారు.వారిలో చరణ్,తారక్,బన్నీ కూడా ఉన్నారు వారి స్టామినా ఏంటో మనం అందరం చూశాం.రీసెంట్ గా వచ్చిన దేవర తెలుగులో నెగెటివ్ టాక్ అలాగే పుష్ప ఈ సినిమా కు సేం రిపీట్ నెగెటివ్ టాక్ అసలు నిన్న రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్ కు పనికట్టుకుని దారుణం గా నెగెటివ్ చేశారు అని క్రిష్టల్ క్లియర్ గా రుజువయ్యింది .అసలు ఎందుకు ఇంత నెగెటివ్ వైబ్స్ ఉన్నాయి.అసలు దీనికి కారణం ఎవరు అనేది నా ద్రుష్టి కోణం లో నేను గమనించిన దాని బట్టి తెలియజేస్తున్నాను.
అసలు ఈ దరిద్రం అంతా కరోనా తర్వాత మొదలయ్యింది అవును కరోనా లో రెండు సంవత్సరాలు ఖాళీగా ఉన్నయువత చదువు మీద ద్రుష్టి సారించకపోగా సోషల్ మీడియా పై ఓ.టి.టి లపై బాగా ఆశక్తి చూపారు ఒక వైపు సినిమాలు చూడడం పెరిగింది అన్ని భాషలను ఆదరించారు అన్ని భాషా చిత్రాలు చూస్తున్నారు మంచి పరిణామమే .అలానే సోషల్ మీడియాలో పని పాట లేని వారు కాలేజ్ కు వెళ్ళే కుర్రాళ్ళు కూడా ఒకచోట చేరి ఈ దరిద్రానికి కారణం అయ్యారు.
అయితే అసలు తారక్,చరణ్ అభిమానులు అయితే ఇంకా దారుణం అయిన స్టేజ్ లో నే ఉననరు వాళ్ళు ఇంకా 3 ఏళ క్రితం రిలీజ్ అయిన సినిమా ఆర్.ఆర్.ఆర్ లో మా హెరో మెయిన్ అంటే మాహీరో అని ఇద్దరూ ఇప్పటికి ఎటూ తేల్చుకోలేక పోతున్నారు అంటే వీరి పిచ్చి ఎంత పరాకాష్ట కు చేరిందో ఇది చదివిన కాని రోజూ ఎక్స్ వేదిక గా కాని వేరే సోషల్ ప్లాట్ ఫారంస్ లో వాళ్ళు మాట్లాడే మాటలు పెట్టే పోష్టులు బట్టి ఈజీగా అర్దం చేసుకోవచ్చు.వాళ్ళ భాధ ఎంటో ఎవ్వడికి అర్దం కాదు సినిమా తీసిన డైరెక్టర్,నిర్మించిన ప్రొడ్యూసర్ పని చేసిన ఆర్టిష్టులు హీరోలు ఇలా అందరూ ఎంతో హ్యాపీ ఆస్కార్ వచ్చింది అయిన ఎంటి అయినా మా హీరో మెయిన మీ హీరో సైడ్ హీరో అని రోజూ లేకపోతే గుర్తుకువచ్చినప్పుడు లేదా హీరోల సినిమా రిలీజ్ అయినప్పుడు ఇక కామెంట్స్ పోస్ట్లు ఇదే పని.ఇది ఒక మిష్టరీ లా ఉంటుంది ఎవ్వరూ తగ్గరు ఎందుకు చేస్తారో వాళ్ళకి తెలీదు.
ఇక బన్నీ విషయానికి వస్తే ఈయన ఫ్యాన్స్ భాధ వేరు ఒక మెగా అభిమానులు లాగ కలసి ఉండే వీరు బన్నీ పవన్ పై అప్పుడు చెప్పను బ్రదర్ అన్నప్పిడే నెగెటివ్ రావడం మళ్ళీ ఫ్యాన్స్ కు క్లాస్ పీకడం ఇవన్నీ జరిగిన దగ్గర నుండి పికె ఫ్యాన్స్ దూరం పెట్టారు తర్వాత ప్యాచ్ అప్ అయ్యింది మరో సినిమా సక్సెస్ మీట్ కు పవన్ గెష్ట్ గా రావడం బన్నీ పికె గురించి చెప్పడం ఇలా బానే ఉన్నా తర్వాత సినిమా హిట్ అవ్వడం నా ఆర్మీ అనడం నా ఫ్యాన్స్ అనడం ఇక మెగా లో లేరు అని ఫిక్స్ అయిపోయి ఇటు కాస్త నెగెటివ్ స్టార్ట్ అయ్యింది .ఇక ఎలెక్షన్స్ లో వైసిపి లో ఉన్న తన ఫ్రెండ్ కు ఎప్పుడైతే సపొర్ట్ అని వెళ్ళాడో ఇక పీక్ స్టేజ్ కు వెళ్ళింది.అటు టి.డీ.పి అభిమానులు ఇటి పికె ,మెగా అభిమానులు అందరూ నెగెటివ్ చెయ్యడం స్టార్ట్ చేశారు అది సినిమా రిలీజ్ వరకు పాకి పెద్దది అయ్యి దారుణమైన స్టేజ్ కు వచ్చింది.
అయితే ఇక్కడ అందరు అభిమానులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇలా నెగెటివ్ చేసే అందరూ అభిమానులు కాదు అది మాత్రం పక్కా.అందరూ తెలుసు కోవాల్సిన విషయం ఇదే ఆలొచించాల్సిన అవసరం కూడా చాలా ఉంది.ఎందుకు అంటే సోషల్ మీడియాలో ఎక్కడా కూడా మీరు ఒరిజినల్ గా ఎవరు మీ ఐడెంటిటి ఏంటి అనే నిజం ఉండడు.సో ఇక్కడే అసలైన రాజకీయం జరుగుతుంది .అసలు ఎప్పుడైతే పవన్ రాజకీయాలలో వచ్చారో టార్గెట్ ఆయన ఒక్కడే కాదు టోటల్ మెగా ఫ్యామిలీ ఉంటది అలాగే రాజకీయాలకి దూరం గా ఉండి తన పని చేసుకుంటున్న తారక్ గతి ఇదే ఆ పర్టీ అభిమానులే కావొచ్చు వారు అనుకున్న సమయాలలో రెస్పాన్స్ రాకపోతే అంతే సంగతి సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేయడం నెగెటివ్ క్యాంపయిన్ మొదలు ఇది నేను 2014 బాద్ షా సినిమా సమయం నుంచే గమనిస్తున్నాను అప్పట్లో ఏకం గా ఒక చానెల్ లో పిల్ల కాకి అని ప్రోగ్రాం కూడా చేశారు అప్పటి నుంచే మనోడి మీద కసి ఉంది.
అలాగే బన్నీ విషయం లో అంతే అవతల పార్టీ సపొర్ట్ వల్ల పికె పై కామెంట్స్ ను ద్రుష్టిలో పెట్టుకుని అవతల పార్టీ సొషల్ మీడియా లో చాలా తెలివిగా పవన్ ఫోటో లతో ఈ దాడి స్టార్ట్ చేస్తుంది అది కూడా సమయం సంధ్ర్భం బట్టి ఏ హీరో పిక్ పెట్టి ఎప్పుడు బన్నీ మీద నెగెటివ్ చేయాలి అని చాలా ఆర్గనైజ్డ్ ఉంటుంది ఈ ప్రాసెస్.మొన్న బన్నీ అరెస్ట్ హైదరబాద్ లో జరిగితే మెగా కుట్ర అని పవన్ యే చేయించాడని అసలు దారుణం గా పోస్ట్లు సంభంధం లేని కామెంట్లు ఏవేవో పెడతారు అసలు కొన్ని ఏకం గా ఆ పార్టీ సభ్యులు కూడా ఓపెన్ గా చేశారు దీన్ని బట్టి కూడా అసలు ఫ్యాన్స్ అర్దం చేసుకోవాలి ఎవరు అసలు ఫ్యాన్స్ ముసుగులో ఉండి దూరం పెంచాలి నెగెటివ్ చేయాలి అని చూస్తున్నది అసలు ఫ్యాన్స్ యేన అన్న విషయం తెలుసుకోవాలి.తారక్ ది అంతే ఆ సమయానికి ఉన్న సిట్యువేషన్ బాలయ్య ఫోటోలతో లోకేష్ లేద బాబు గారి పిక్స్ పెట్టుకుని ఒకటే పని చేస్తారు.
మొన్న దేవర,పుష్ప,ఇప్పుడు గేమ్ ఛేంజర్ ,తెలుగులో ఇంత నెగెటివ్ ఎందుకు ..పూర్తి విశ్లేషణ?
అయితే ఫ్యాన్స్ చెయ్యర అంటే చేస్తారు మీరు గమనిస్తే వారు చాలా తక్కువ ఉంటారు ఎందుకు అంటే ఆ సమయానికి స్పందన సరిగ్గా లేదని వారు అనుకున్నది హీరో చెప్పలేదు అని ఫ్రష్టేషన్ లో పెడతారు కాని అదే పనిగా వారు రోజు తరబడి సంవత్సరా తరబడి చేయరు వారికి ఆ ఓపిక తీరిక రెండూ ఉండవు రెపయిన వాడు మా హీరోనే అని వదిలేస్తారు.ఇది చాలా అర్గనైజ్డ్ గా చేసే ఒక ప్రాసెస్ ఇది పక్క ప్లాన్ తో సమయానికి ఎవ్వరిని తిట్టాలి ఏ హీరో పిక్స్ ఉన్న ఏకౌంట్స్ వాడాలో ప్రణాలిక రోజూ ఎన్ని ఎకౌంట్స్ వాడాలి అనే పూర్తి ప్లాన్ వారి దగ్గర ఉంటుంది.కావాలంటే ఫ్యాన్స్ కాని ఎవరయిన కాని ఆ పోస్ట్లు కాని వారి ప్రొఫైల్ కాని చూసిన వారి ఫాలోవర్స్ కూడా సేం అన్నీ ఎకౌంట్స్ ఒకేలా ఉంటారు.కొంతమంది వీలయితే హర్డ్ కోర్ ఫ్యాన్స్ అని ఏకం గా ఆ హెరోలతో పోటో తీసుకుని ఆ పిక్స్ పెట్టుకుని రాజకీయం చేస్తూ ఉంటారు.
మొన్న బన్నీ విషయం లో జరిగింది అదే అప్పుడు తారక్ విషయం జరిగింది ఇదే అలాగే ఇప్పుడు పికె క్లోజ్ కాబట్టి చరణ్ విషయం లో జరుగుతుంది ఇదే ఫ్యూచర్ లో జరిగేది ఇదే .అది వీరి ముగ్గురి విషయ్మ్ లోనే కాదు మహేష్ అయిన ప్రభాస్ అయిన ఇదే జరుగుతుంది .అసలు వీరి వల్ల ఎవరికి నష్టం తెలుసా ,నిర్మాతలకి కష్టపడి పని చేసిన ప్రతి సినిమా యూనిట్ సభ్యుడికి . అసలు ఈ దారుణం అయిన టోలింగ్ లో ఈ ముగ్గురూ హీరోలకి సంభంధించిన 4 నుంచి 6 ఫ్యాన్ ఏకౌంట్స్ కూడా ఉన్నయి అవి రియల్ ఫ్యాన్సే అది మాత్రం నిజం ఆ ఆరుగురి వల్ల టోటల్ సినిమా మీద తర్వాత నిర్మాతలకి చాలా భారం గా మారింది.అయినా ఎవడు ఎన్ని చేసినా కానీ ఏ కామెంట్స్ చేసినా కాని సినిమాలో దమ్ముంటే ఎవ్వడూ దాని ఉనికిని చెరపలేరు అందులో ఎలాంటి సందేహం లేదు కాని ఇప్పుడు ఉన్న సమయం లో ఉన్న టికెట్ రేట్స్ కు జనాలు థియేటర్స్ కు రావడమే గాగనం అయితే ఈ రివ్యూ ల వల్ల వచ్చే ఆ కొద్ది మంది రావడం లేదు దాని ఇంపాక్ట్ చాలా ఉంది అది ఈ ఆరుగురికి తెలీదు ఎందుకు అంటే ఆ పైశాచిక ఆనందం .
అవతల వాడు లే ఆ సినిమా ఎప్పుడు పోతుందా అని చూడాలి లేదా బాగా ఉన్నా బాలేదు అని చెప్పాలి అప్పుడే మానసిక ఆనందం వారి ఆరుగురిలో కలుగుతుంది.అలా చేస్తే పైసా నీకు కలిసివస్తుందా ఏం లాభం మీకు రేపు మీ జీవితం లో మీరు కష్టాన్ని ఎవడైన అలా అంటేనో మీకు అలా జరిగితేనో తెలుస్తుంది ఆ భాధ అసలు హీరోలకు లేని భాధ మీకెందుకు వస్తుందో తెలీదు.ఇద్దరి హీరోలతో సినిమా తీయలంటే భయం చాలా మందికి ఇలానే కొట్టుకుంటారని పోనీ తీసి హిట్ అయ్యి ఆస్కార్ వచ్చిన మీ పిచ్చి ఏంటో పైత్యం ఏంటో అర్దం కాదు.ఇంత దరిద్రమైన ఆలోచనలతో పైశాచికం తో సమాజం లో ఎలా ఉంటున్నారి ముఖ్యం గా ఆ 6 గురు.ఏ విషయాన్ని అయిన కామెంట్ చేయడం చాలా ఈజీ కాని అది మంచిది అని ప్రూవ్ చేయాలి తెలియజేయాలి అంటే ఎంత కష్టమో తెలుసా మీరు వేసే ఒక ట్వీట్ వెనుక ఎంతో మంది సినిమా వాళ్ళ కష్టం ఉందో తెలుసా ఎన్ని రోజుల శ్రమ ఎంతో డబ్బు ఎన్నో లక్సల మంది జీవితం ఫైనల్ ఆ సినిమానే లేకపోతే నీకు బోర్ కొట్టిన సినిమా చూడాలంటే రేపు ఏం మిగలవ్ వారు సినిమా తీయకపొతే ఏం చేస్తావ్ ఇలా అందరిని నెగెటివ్ చేస్తున్న మీరు మీ జీవితం లో పైకొస్తారా ఆ నెగెటివ్ బ్రెయిన్ తో ఉండే మీరు మెంటల్ కూడా చాలా వీక్ .
ఏం సాధిస్తారు మీరు ఈ సినిమా నష్టం వస్తే ఆ సినిమా లాభాలు వస్తే మీకేమైన పంచుతార.అవతల వారికి ఎప్పుడూ మనం చులకన అవ్వకూడడు ఇప్పుడే గ్లోబల్ వైడ్ గా పెరుగుతున్న తెలుగు సినిమా స్థాయిని మీలాంటి సైకోల వల్ల అది ముందుకు ఎలా వెళ్తుంది రాబోయే రోజుల్లో ఇది ఇంకా ఎక్కువ అవుతుంది కాని తగ్గదు అని అనుకుంటునా.అసలు మన వాడు మన తెలుగు మన సినిమా అనే రోజు ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు.మరోపక్క నిర్మాతలు కూడా తమ హీరో సినిమాలతో వేరే సినిమా రిలీజ్ అవుతున్నప్పుడి ఈసారి మనదే మనమే అని గుచ్చి గుచ్చి ఫ్యాన్స్ ను గెలకడం .అసలు మన తెలుగు సినిమాలు వస్తున్నాయ్ అన్నింటిని ఆదరించండి అని ఒక్కమాట చెప్తే పోయేదానికి మనదే ఈ సీజన్ మన సినిమానే హిట్ ఇలా అతి చేయడం మళ్ళీ మా సినిమా నెగెటివ్ చేస్తున్నారు అని చెప్పడం ఎంటి ఈ దరిద్రం.
ఏ సినిమాకు సమస్య వచ్చిన అందరూ ముందుకు రావాలి అందరూ కలసి పని చేసుకోవాలి అలా కాదు చిన్న సినిమా కు వీరికి సంభంధం లేదు అన్నట్లు వీరి బిహేవియర్ కూడా అసలు బాగాలేదు.అయినా ఇంత ఎందుకు అంటే అసలు ఫ్యాన్స్ ముసుగులో ఉండి చేస్తున్న వారి గురించి చెప్పడానికి అలాగే ఆ 6 యదవలకి బుద్ధి వస్తది అని ఈ రోజు వాడ్ని నువ్వు నెగెటివ్ చేస్తే రేపు నీ దగగ్రకి వచ్చేసరికి అది రెట్టింపు అవ్వుద్ది అదే ఈ ముగ్గురి విషయం లో జరుగుతుంది .సో తెలుగు సినిమా బాగుండాలి అందరం ఎంజాయ్ చేయాలి అంతే పని కట్టుకుని పెంట చేయక్కర్లేదు అనేది మా భావం .







