జయహో బాలయ్య ఎన్టీఆర్ పేరు నిలబెట్టిన వారసుడు..పద్మభూషణ్ బాలయ్య స్పెషల్ స్టొరీ ! నందమూరి తారక రామారావు ఈ పేరు వినగానే తెలుగు జాతి గర్వించిపోతుంది ఈయన వల్ల ఈ పేరు వల్ల మనం ఒక తెలుగు వాళ్ళం ఉన్నాం అని మొదట అందరీఇ ఇండియాలో మనల్ని తక్కువ చేసి చూసిన అందరికి ఈ పేరే అప్పట్లో సమాధానం ఆ తర్వాత రాజకీయాలు అన్ని వచ్చి ప్రజా సేవ అలా జీవితం ముగిసింది.తర్వాత ఆయన కొడుకు గా సినిమాల లోకి వచ్చిన నందమూరి నట వారసత్వం ఎప్పటికి నిత్య యవ్వనుడి గా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండే బాలయ్య బాబు .తండ్రి తో సినిమాలు ఆయన డైరెక్షన్ లోనే సినిమాలు చేసి తర్వాత నటుడిగా ఎన్నో మెట్లు ఎక్కిన బాలయ్య ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు చేసుకుంటూ సరి కొత్త పంధాలో ఎన్నో సినిమాలలఓ నటించడం అసలు అప్పుడున్న సమయానికి కూడా బాలయ్య తనదైన పంధాలో సినిమాలు చేయడం జరిగింది.
ఆయన చాలా దైర్యం చేసి చేసిన భైరవ దీపం సినిమా ఒకప్పటి పాతాళ భైరవిమి గుర్తు చేసిన కాని ఆ సినిమా కు ఈ సినిమాకు ఒకటే రేంజ్ లో ఆదరణ ప్రేక్షకుల నుంచి లభించడం ఆయన కెరీర్ లో పెద్ద హిట్ గా నిలవడమే కాదు ఆయన నటనకు అందరూ ఫిదా అయిపోయారు.ముఖ్యం గా గూని వాడి గా చేసిన పాత్రలో బాలయ్య అధ్బుతం అనే చెప్పాలి.ఇక తర్వాత ఎన్నో కమర్షియల్ సినిమాలు చేసిన మళ్ళీ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో చేసిన ఆదిత్య 369 సినిమా అసలు ఆ సినిమా ఇప్పటికే ఎంతో మందికి చాలా ఇష్టం అంత బాగుంటుంది అలా చాలానే సినిమా లు ఆయన ఖాతాలో ఉన్నాయి.తర్వాత ట్రెండ్ కు తగ్గట్లు సినిమాలు చేయడం సక్సెస్ లు అందుకోవడం ఒక ఎరా అయితే ఫ్యాక్షన్ మూవీస్ అంటే బాలయ్యే అనే రేంజ్ లో ఆ సినిమాలు రావడం వచ్చిన అన్నీ సినిమాలు దాదాపు గా హిట్ అవ్వడం జరిగింది.
జయహో బాలయ్య ఎన్టీఆర్ పేరు నిలబెట్టిన వారసుడు..పద్మభూషణ్ బాలయ్య స్పెషల్ స్టొరీ !
దాని తర్వాత కమర్షియల్ గా ఎన్నో సినిమాలు చేస్తున్న సమయం లో రాముడిగా నటించి అందరిని తన నటనతో శ్రీ రామరాజ్యం సినిమా తో ఆ గెటప్ తో తన తండ్రిని గుర్త్ చేశాడు.తర్వాత కొన్ని సంవత్సరాలకి వచ్చిన గౌతమి పుత్ర శాతకర్ణి ఆ సినిమా నభూతో అనేలా ఉండడం అలాంటి సినిమా ఆవయస్సులో చేయడం జరిగింది.ఇప్పటికి మచి కథలతో వరుస హిట్లతో అందరిని అలరిస్తూనే ఉన్నాడూ బాలయ్య.అయితే ఆయన తన సిని జీవితం లో జానపద, సాంఘిక, పౌరాణిక, చారిత్రక, సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ వంటి చిత్రాలలో నటించి చిత్ర సీమలో 50 ఏళ్ల నట ప్రస్థానం ఇటీవలే పూర్తి చేసుకొని కళామతల్లిని మెప్పిస్తూనే వున్నాడు.
మరోవైపు హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం అందుకుని తన వంతు బాధ్యతలు నిర్వహిస్తూ.. బసవ తారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ చైర్మన్‌గా కూడా తన సేవలు అందిస్తూ వున్నాడు. అయితే ఈ రోజు ఆయనకు ఒక్క నటుడిగా అందరిని ఇన్ని సంవత్సరాలు మెప్పించి నందుకే కాదు ఆయన ఎన్నో ఏళ్ళుగా చేస్తున్న సేవలని గుర్తించి ఈ రోజు ఈ అవార్డు రావడం ఆయనకు ఆయన అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగించే విషయం.అలాగే తన తోటి నటూలలో మొదట చిరంజీవి కి 2006 లో రావడం జరిగింది.

గత యేడాది ఆయనకు పద్మ విభూషణ్ కూడా వచ్చింది.ఇక ఈ యేడాది మనం బాలయ్యకు పద్మ భుషణ్ రావడం జరిగింది.వీరిదారికే ఈ అవార్డు రావడం వీరి కష్టానికి సేవకి కేంద్ర ప్రభుత్వం గౌరవం తో సత్కరించడం మరింత మందికి స్పూర్తిదాయకం.ఇక ఆయన ఈ విషయం లో తన త్రండ్రి ని దాటేసాడు.ఆయనకు అప్పటి ప్రభుత్వం కేవలం పద్మ శ్రీ అవార్డూ మాత్రమే ఇవ్వడం జరిగింది.అయితే బాలయ్య తన తండ్రిని దాటి పద్మ భూషణ్ అవార్డు గ్రహీతుడు అయ్యాడు.అయితే ఈ అవార్డు ఆయన పేరు పక్కన అనేది ఎంతో మందికి ఆనందం అయియ్తే ఆయన కు మాత్రం మరింత భాధ్యత మరింత సేవ చేయాలంటే ఎనర్జీ ఎక్కువ సినిమాలు చేసి అలరించాలి అనే భావం తో క్రుషి పట్టుదలతో ఆయన ఉండడం జరుగుతుంది,బాలయ్య అంటే అందరికి సినిమా ఇండస్త్రీ లో మంచి భావం ఉంది .
ఏది మనసులో ఉంచుకోడు అని తన మాట తీరు అన్నీ నిజం గా ఉంటాయి అని ఎవరు ఏది అన్నా పట్టించుకోడు అని తనకు నచ్చితే చేశ్తాడు అని లేకపోతే వాడ్ని దగ్గరకు రానివ్వడు అని నానుడి.అలాగే ఆయన మనసూలో ఒకటి బయట ఇంకొటి మాట్లాడే వ్యక్తి అయితే అస్సలు కాదు.భోళా బాలయ్య ఆయన.ఎంతో మంది స్నేహితులు తోటి నటులతో మంచి రిలేషన్ పెద్దలతొ అగూరవం చిన్న వాళ్ళ తో ఫ్రెండ్ షిప్ చేయడం ఒక్క బాలయ్య కే సాధ్యం.బాలయ్య అందరికి మీడీయాలో చూపినట్లు కొట్టడం ,ఫోన్స్ పగలకొట్టడం మాత్రమే గుర్తుకు వస్తాయి కాని ఆయన సేవలు ఎంతో మందికి తెలీదు .
ఆయన చేసిన సేవలు ఎవ్వరికి తెలీయనివి ఆయన హస్పిటల్ లో ఆయన ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్స్ కు ఉచితం గా ఎలాంటి కర్చు లేకుండా ఎంతో మందిని బ్రతికిస్తూనే ఉననరు.ఆయన ఎన్నో సంవత్సరాలుగా అక్కడ చైర్మన్ గా సేవలు అందిస్తూ తన తల్లి గారిని స్మరిచుకుంటూ తనకు వచ్చిన కష్టం మరే కుటుంబం లో రాకూడదు అని నిత్యం తన వంతు క్రుషి చేస్తూనే ఉన్నాడు.ఈ వయస్సులో ఆయన పొద్దునే లెగిచి తన పనులు చూసుకుని కరెక్ట్ టైం కు షాట్ కు వెళ్ళి షూటింగ్ లో పాల్గొనడం ఆయనకు వ్రుత్తి పట్ల ఉన్న నిభద్ధత ను తెలియ జేస్తుంది.ఇక ముందు ఇలాగే మమ్మల్ని అలరించి మాకు ఇన్స్పిరేషన్ గా ఉంటూ ఇంకెన్నో సేవలు చేస్తూ ఉంటారని జై బాలయ్య జయహో బాలయ్య.
Follow : https://telugutalkiz.com/







