Sankrantiki Vastunnam Two Days collections :బాలయ్యను దాటేసి చరిత్ర స్రుష్టించిన వెంకిమామ సంక్రాంతికి రికార్డుల మోత… వెంకిమామ అదే మన విక్టరీ వెంకటేష్ గారు నతించిన సినిమా దిల్ రాజు బ్యానర్ లో ఈ ఏడాది రిలీజ్ అయిన సంక్రాంతికి వచ్చిన మూడో సినిమా అనీల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన 8 వ సినిమా మీనాక్షి మరియు ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లు గా నటించిన సినిమా సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా.ఈ సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన అన్నీ సినిమాల కంటే ఏక్కడ చూసినా ఒకటే టాక్ హిట్,సూపర్ హిట్ వెంకి మామ ఈసారి వదల్లేదు అని .
అది మరి దాని సంగతి గత యేడాది ఇలాగే సంక్రాంతి రేసులో ఉన్నాడు వెంకి కాని ఈ యేడాది సంక్రాంతి ఆయనకు ఎంతో మంచి అనుభవం ఇవ్వడమే కాదు ఫుల్ జోష్ ని కూడా ఇచ్చింది అనే చెప్పాలి.ఎందుకు అంటే గత కొన్ని సంవత్సరాలుగా వెంకి మామ కు సరైన హిట్ లేదు ఈ ఏడాది ఆరభం లోనే అదుర్స్ అనేలా ఈ సినిమా కలెక్షన్స్ కూడా ఉన్నాయి.ఈ సినిమా ఈ రెండు రోజుల్లోనే ఏకం గా 75 కోట్ల మేర గ్రాస్ కలెక్ట్ చేసి వెంకి మామ కెరీర్ లోనే బెస్ట్ కలెక్టెడ్ మూవీ రికార్డులు క్రియేట్ చేసింది అంటే మాములు విషయం కాదు.ఆయన సినిమాలు హిట్ అయినా కాని ఈ రేంజ్ లో కలెక్ట్ చేయడం ఇదే తొలిసారి అనుకుంటా .ఆయన ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరడం కేక్ వాక్ .ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గరి నుండి ఒకటే మాట ఒక్క టికెట్ ముక్క కూడా లేదు అని.
అవును ఈ సినిమా కు వేసిన అన్నీ షోల లో టికెట్స్ యే దొరకడం లేదు అంటే అర్దం చేసుకోండి ఏ రేంజ్ లో ఉందో ఈ సినిమా బజ్ .ఈ సినిమా మొదటి రోజు ఏకంగా 40 కోట్ల గ్రాస్ వసూళ్ళు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది ఇక రెండవ రోజు కూడా పోటా పోటీగా 35 కోట్ల పైనే కలెక్ట్ చేసి వెంకి కెరీర్ లో ది బెస్ట్ మూవీ గా నిలుస్తుంది.దీంతో సీనియర్ హీరోల మధ్య పోటీ ఏర్పడింది అని చెప్పడం లో అనుమానం లేదు.బాలయ్య సినిమా 3 రోజులకు ఈ మార్క్ అందుకుంటే వెంకి మామ రెండు రోజుల్లోనే ఈ మార్క్ అందుకుని బాలయ్య కు షాక్ ఇచ్చాడు అనే చెప్పాలి.ఇక ఈ సినిమా లాంగ్ రన్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అని ట్రేడ్ వర్గాల విశ్లేషణ.చాలా చోట్ల ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ద్రుష్ట్యా కొత్తగా థియేటర్స్ ను తీసుకుంటున్నారు.ఫ్యమిలీ ఆడియన్స్ ఈ సినిమా కు బ్రహ్మ రధం పడుతూ ఉన్నారు.వెకి మామ క్లాస్,మాస్ ఫ్యాన్స్ ఉన్నా కాని ఫ్యామిలీ అడియన్స్ లో ఆయనకు ఉన్న క్రేజ్ యే వేరు .
Sankrantiki Vastunnam Two Days collections :బాలయ్యను దాటేసి చరిత్ర స్రుష్టించిన వెంకిమామ సంక్రాంతికి రికార్డుల మోత…
అయితే ఈ హిట్ తో అటు వెంకీ తో పాటు దిల్ రాజు కూడా ఎంతో జోష్ లో ఉన్నారు.ఎన్నో అంచనాలు పెట్టుకున్న రాం చరణ్ సినిమా రిలీజ్ అయిన అన్నీ చోట్ల అనుకున్న బజ్ క్రియేట్ చేయలేక పోయింది.సినిమా రిలీజ్ రోజే ట్విష్ట్లు చెప్పేయడం సినిమా ఏకంగా బస్ లలో ప్లే చేయడం అంతా ఒక మైనస్ అయ్యింది ఆ భాధని సంక్రాంతికి వస్తున్నాం సినిమా పూడ్చేసింది. ఈ సినిమా ఒక్కటే టాక్ హిట్ అంతే.ఇక ఈ సినిమా వారిలో ఒకింత స్ట్రెస్ బాస్టర్ గా మారింది అనే చెప్పాలి.అయితే అనీల్ తీసిన ఈ సినిమా తో వరుసగా 8 హిట్లు అందుకున్న డైరెక్టర్లలో ఆయన కూడా చేరారు ఇప్పటి వరకు తీసిన అన్నీ సినిమాలు సూపర్ హిట్ అలానే రాజమౌళీ కూడా అన్నీ హిట్లే
కాని ఆయనలా ఎవరూ ఫ్లాప్ లేని డైరెక్టర్ లేరా అని చూస్తున్న సమయం లో మనోడు ఎంట్రీ ఇచ్చి తీసినీ అన్నీ సినిమాలు హిట్ అలాగే లాభాలు తెచ్చి పెట్టిన సినిమాలే కావడం అందరికి సంతోషాన్ని ఇచ్చే విషయం అందులో 5 సినిమా రాజు బ్యానర్ లో చేయడం అంద్రికి ఆనందాన్ని ఇచ్చే విషయం .ఇక గత యేడాది సైంధవ్ తో వచ్చిన వెంకి మామ ఆ సినిమా ఊహించని ఫలితాన్ని ఇచ్చింది అనుకున్న స్థాయిలో ఆడలేదు ఫ్లాప్ టాక్ తో సరిపెట్టు కోవాల్సి వచ్చింది.ఆ సినిమా కథ ఎవ్వరికి పెద్దగా ఎక్కలేదు ఆ ఏడాది మిస్ అయిన హిట్ కాదు భారీ హిట్ ఇప్పుడు సంక్రాంతికి వెంకు ఫుల్ ఫిల్ చేసుకున్నారు.ఈ సినిమా తో 100 కోట్ల మార్క్ లేని వెంకి మామ కూడా క్లబ్ లో యాడ్ అవ్వబోతున్నారు.ఈ సినిమా తో దిల్ రాజు కూడా మంచి లాభాలు అందుకోవడం ఖాయం.
ఇక వెంకీ మామ ఏలాంటి సినిమాలు చేస్తారా అని అభిమానులు కూడా ఏదురు చూస్తూ ఉన్నా సమయం లో వెంకీ కూడా ఈ సినిమా చూసిన తర్వాత అన్నయ్య సురెష్ అలాగే సితార సంస్థ మరో రెండు బ్యానర్లు వరుసగా సినిమా చేయడానికి కథలు సిద్ధం చేస్తున్నారు అని ఇక వరుస సినిమాలతో మిమ్మల్ని అలరిస్తాను అని ఆయన చెప్పడం జరిగింది.అదీ కాకుండా ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా కోసం వెంకీ చాలా కష్ట పడ్డారు అన్న విషయం చాలా క్లియర్ గా కనపడుతుంది.అసలు ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన ఎంత యాక్టివ్ గా పని చేశారో మీకే అర్దమవుతుంది.అన్నీ షోలకి ఫంక్షన్ లకు ఆయన అటెండ్ అవ్వడం ఈ వయస్సులో ఆయన ఎనర్జీ ఎవ్వరు అందుకోలేరు.ఆ రేంజ్ లో ఆయన కష్టపడి ప్రమోషన్స్ లో పాల్గొని సినిమా బజ్ విషయం లో కీలక పాత్ర పోషించారు.