9 రోజుల్లోనే కల్కి,పుష్ప2 రికార్డ్స్ అవుట్…వర్కింగ్ డేస్ లోనూ వెంకీ ర్యాంపేజ్! సంక్రాంతికి వస్తున్నాం అనే ఈ సినిమా పేరు మాత్ర చాలా కాలం అందరికి గుర్తుండి పోతుంది ఈ సినిమా అందరి కంటే ఇద్దరికి మాత్రం మెమరిబుల్ అనడం లో ఏం సందేహం లేదు .ఇంతకి ఆ ఇద్దరు ఎవరు అంటే ఒకరు విక్టరీ వెంకటేష్ అయితే మరోకరు మాత్రం దిల్ రాజు గారే .అవును చాలా కాలం తర్వాత ఇద్దరికి ఈ రేంజ్ లో సక్సెస్ రావడం ఒక యెత్తు అయితే దిల్ రాజు ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా వచ్చి నిజంగా అయన భాధలను తీసి అవతల పడేసి గేం చేంజర్ కు పెట్టిన మనీ చాలా వరకు రికవరీ చేస్తుంది .ఈ సినిమా కు వస్తున్న కలెక్షన్స్ చూసి ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్య పోతున్నారు.
9 రోజుల్లోనే కల్కి,పుష్ప2 రికార్డ్స్ అవుట్…వర్కింగ్ డేస్ లోనూ వెంకీ ర్యాంపేజ్!
ఈ సినిమా రేంజ్ ను చాలా తక్కువ చేసి చూసిన అందరికి అందరూ నోరు మీద వేలు వేసుకునేలా చేసి ఏ సినిమా ను అయిన ఇలా తక్కువ అంచనా వేయకూడదు అని పెద్ద సినిమా పెద్ద డైరెక్టర్ అని ఒకరు మాస్ సినిమా అని మరొకరు అనుకుంటే ఇదారూ పక్కకు తప్పుకోండి నేను వస్తున్నా అంటూ ఈ సంక్రాంతికి వంకి మామ సంక్రాంతికి వస్తున్నాం అనే ఈ సినిమా తో రికార్డ్స్ బ్రేక్ చేస్తూ వస్తున్నాడు.నిన్న ఈ సినిమా వర్కింగ్ డే అయినా తగ్గలేదు నిన్నటితో తో 230 కోట్ల మేర గ్రాస్ దాటిన ఈ సినిమా 5 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.ఈ మధ్య కాలం లో ఈ రేంజ్ లో వర్కింగ్ డేస్ లో ఈ రేంజ్ కలెక్ట్ చేసిన సినిమా కావడం అది వెంకి కి ఉన్న మార్కెట్ తన ముందు సినిమాలు పెద్ద గా ఆడకపోయినా కాని ఈ రేంజ్ జనాల ఆదర్ణ ముఖ్యం గా ఫ్యామిలీస్ ఇంకా ఎగబడి చూస్తున్నారు.
ఒక్క విజయనగరం లో ఈ సినిమా ఇప్పటికే 2.5 కోట్ల దగ్గరకు వచ్చింది.ఈ వీకెండ్ తో ఆ ఏరియాలో కల్కి,పుష్ప 2 సినిమాల కలెక్షన్స్ దాటేయడం కాదు ఆల్ టైం నెం 1 గా ఆ ఏరియాలో నిలవనుంది.ఈ సినిమా కు ఉన్నటికెట్ రేట్స్ కూడా నార్మల్ రేట్స్ యే ఆ సినిమాల లాగా ఎక్కువ పెంచలేదు అది వెంకి సినిమా స్టామినా అని ఫ్యాన్స్ తెగ ఆనందపడి పోతున్నారు.ఇక ఈ సినిమా కలెక్షన్స్ కొద్దిగా తగ్గలి అంటే వచ్చే నెల వచ్చే సినిమాల మీద ఆధారపడి ఉంటుంది అంతవరకు ఈ సినిమా బాక్సా ఫీస్ వద్ద ర్యాంపేజ్ ఖాయం.
అయితే ఈ సినిమా తో దిల్ రాజు గేం చేంజర్ కష్టాల నుంచి భయట పడి నట్లే అని ఇక ఆయన ఆనందానికి కారణం కూడా ఈ సినిమా కు వచ్చిన కలెక్షన్స్ అలాగే మళ్ళీ రాజు ఇజ్ బ్యాక్ అనే పేరు సిని వర్గాలలో వినబడుతుంది.అయితే ఈ సినిమా గత సంక్రాంతికి వచ్చిన హనుమాన లాగానే పోటీ అలాగే అంచనాలు పెద్దగా లేవు అనీల్ రావిపూడి సినిమా అంటే ఈ రేంజ్ కలెక్షన్స్ లేవు సో అంత ఉండదు హిట్ అవుద్ది అనుకున్నారు కాని చూస్తే ఇదే ఇండస్ట్రీ హిట్ అయ్యేలా ఉంది ఈ యేడాది ఈ సినిమా మొదటి నెలలో చివరగా రిలీజ్ అయిన సంక్రాంతికి హిట్ కొట్టి కలెక్షన్స్ విషయం లో మాత్రం ముందు వరుసలో ఉంది.

ఈ సినీమ తో చాలా మంది నిర్మాతలు అనీల్ పై కన్నేసి తమ తమ హీరోలతో సినిమా చేయడానికి అడ్వాన్స్ లు ఇచ్చేస్తున్నారు కాని అనీల్ మాత్రం తర్వాతి సినిమా మెగాస్టార్ తో ఉండబోతుంది.ఈ సినిమా ను సాగు భగవంత్ కేసరి నిర్మాత తో చేయనున్నారు.దీని తర్వాత ,అళ్ళీ ఫ్4 సినిమా పై కథ రెడీ చేసి ఆ సినిమా పనుల్లో బిజీగా ఉండబోతున్నారు అని వీలైతే తనకి డైరెక్టర్ గా చాన్స్ ఇచ్చిన కళ్యాణ్ రాం తో మరొక సినిమా చేసే అవకాశం ఉందని ఆ సినిమా కళ్యాణ్ తన సొంత బ్యానర్ లో చేస్తాడు అని చెప్పడం జరిగింది.ఈ పటాస్ సినిమా వచ్చి ఇప్పటికి పదేళ్ళు పూర్తి చేసుకుంది ఈ సంధ్రభం గా అనీల్ కళ్యాణ్ గారితో సినిమా ఉండే అవకాశం లేకపోలేదు అని చెప్పారు.అయితే ఆ సినిమా ఒక కొత్త జోనర్ తో ట్రై చేస్తా అని ఆయన నాకు అవకాశం ఇచ్చినందుకు జన్మంతా రుణపడి ఉంతా అని చెప్పాడు.
follow : https://telugutalkiz.com/
ఇక వెంకి మామ ది నాది మంచి కాంబో అని నా టైమింగ్ కు ఆయన బాగా సెట్ అవుతారు అని అందుకే మా కాంబినేషన్ లో 10 సినిమా పక్కా అని సక్సెస్ మీట్ లో చెప్పడం జరిగింది.అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో గత కొద్ది కాలం గా పోటీ లో ఎంత పెద్ద సినిమా ఉన్నా కాని కంటెంట్ మీద నమ్మకం తో చిన్న సినిమా ఏదైనా వచ్చింది అంటే అందరూ దాని వైపే చూస్తూ ఉన్నారు కారణం ఇప్పుడు ఆ సినిమాలే అంత కాంపిటేషన్ లో వచ్చినా కలెక్షన్స్ రాబట్టడం హిట్ కొట్టడం జరుగుతూ ఉన్నాయి.హనుమాన్,సంక్రాంతికి వస్తున్నాం కాని మొన్న రిలీజ్ అయిన లక్కీ భాస్కర్,అమరన్ సినిమాల మధ్యలో క సినిమా తో 50 కోట్ల షేర్ వసూలు చేసి మంచి మార్కెట్ సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం అంతే.ముఖ్యం లక్కీ భాస్కర్ కలెక్షన్స్ పై ప్రభావం కూడా చూపింది ఈ సినిమా.
అయితే మొత్తం గా పెద్ద హీరోలు ఎక్కువ బడ్జెట్ లి పెట్టుకుని ఎక్కువ కాలం షూటింగ్ అంటూ సంవత్సరాల తరబడి తీస్తున్న అన్నీ సినిమాల కంటే ఇవే బెటర్ అని వాటికి హిట్ టాక్ వస్తేనే సినిమా నిర్మాత కు లాభాలు అని అవే ఈ సినిమా లకు అయితే హిట్ టాక్ వస్తే పెద్ద సినిమాల కన్న లాభం ఈ సినిమాలకే ఎక్కువ వస్తున్నాయి అని విశ్లేక్షకుల వాదన.







